Uttar Pradesh | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో పోకిరీల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. రాజధాని లక్నోలో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళపై అల్లరిమూక వేధింపులకు తెగబడింది. తాజ్ హోటల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపునీటిలోంచి ఒక వ్యక్తితో కలిసి బైక్‌పై వెనుక కూర్చొని సదరు మహిళ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే నీళ్లలో దిగి వెకిలి చేష్టలు చేస్తున్న దాదాపు 15 మంది యువకులు.. మహిళపై వర్షపు నీళ్లు చల్లుతూ వేధించారు. వాహనంపై నుంచి ఆమెను నీటిలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
– లక్నో
ఢిల్లీలోని సివిల్స్ శిక్షణకు కేంద్రంగా మారిన రాజిందర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్లు మళ్లీ నీట మునిగాయి. రావూస్ కోచింగ్ సెంటర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులు బుధవారం భారీ వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు.
కోచింగ్ సెంటర్ల నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు మంత్రి ఆతిశీ వెల్లడించారు. కాగా, ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్లో ఎవరైనా జైలుకు వెళ్లారా? అని ప్రశ్నించింది. పట్టణ ప్రణాళిక సక్రమంగా లేకపోవడంపై సమాధానం చెప్పాలని ఎంసీడీ డైరెక్టర్‌కు సమన్లు జారీ చేసింది.
– న్యూఢిల్లీ