సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీల పునరుద్ధరణ
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది.
- ప్యాసింజర్ రైలులో ఇకపై కొవిడ్‌కు ముందరి చార్జీలే
- ప్రయాణికులకు ఊరట
- మంగళవారమే అమల్లోకి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రధానంగా ప్యాసెంజర్ రైళ్లలో ప్రయాణాలు సాగించే చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, పేదలకు చార్జీల విషయంలో ఊరట కల్పించేలా రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది. ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్‌గా మార్చిన ప్యాసెంజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ఆర్డినరీ చార్జీలను గతంలో ఉన్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది.
మంగళవారం ఉదయం నుంచే పాత ఆర్డినరీ చార్జీలు అమల్లోకి వచ్చాయి. కొవిడ్ లాక్డౌన్ తర్వాత రైల్వే శాఖ పేర్లను మార్చడం ద్వారా ప్యాసెంజర్ రైళ్లను క్రమంగా ఉపసంహరించింది. దీంతో ఆర్డినరీ క్లాస్‌లో కనీస చార్జి ఎక్స్‌ప్రెస్ రైళ్ల ధరలకు సమానంగా రూ.10 నుంచి రూ.30లకు చేర్చడంపై పెద్దయెత్తున విమర్శలు వచ్చాయి. సమీక్షా సమావేశం నిర్వహించిన రైల్వే బోర్డు.. సెకండ్ క్లాస్ ఆర్డినరీ కనీస చార్జీలను పాత విధానంలోనే వసూలు చేయాలని చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ సూపర్వైజర్లకు సమాచారం అందజేసింది. దీని ప్రకారం ‘మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్’ (మెమూ) రైళ్ల ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు 50 శాతం వరకు తగ్గాయి. యూటీఎస్ యాప్‌లోనూ కొత్త ఈ చార్జీలను అప్డేట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

