Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది. అధికార, విపక్ష కూటమికి చెందిన ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 96 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. రాత్రి 7:45 గంటల వరకూ ఫలితం వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు దక్షిణాదికే చెందిన వారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ప్రకటించాయి. ఎన్డీయే తరఫున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ (CP Radhakrishnan), ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudershan Reddy) పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మరో మూడు గంటల్లో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్నది తెలియనుంది.
Also Read..
DK Shivakumar | ఆశ లేకపోతే.. జీవితమే లేదు: సీఎం పోస్టుపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు