West Bengal: బెంగాల్‌లోని 15 బూత్‌లలో కొనసాగుతున్న రీ పోలింగ్
West Bengal elections: పశ్చిమ బెంగాల్‌లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాలో ఇవాళ 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం రీపోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 29వ తేదీన జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మాగ్రహాట్ పశ్చిమ్, డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రభావత పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రెండో దశ పోలింగ్ రోజున ఆ రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే రిటర్నింగ్ ఆఫీసర్లు, అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ ప్రక్రియను బీజేపీ స్వాగతించింది. మరిన్ని బూత్‌ల వద్ద రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రాన్ని తప్పుగా చూపించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

