Independence Day | దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై అధికారులు మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని ప్రముఖ సైకత శిల్పి (sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) రూపొందించిన సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒడిశాలోని పూరీ తీరంలో (Puri beach) ప్రత్యేకంగా సైకత శిల్పాన్ని రూపొందించారు.
#WATCH | Odisha: Renowned sand artist Sudarsan Pattnaik created sand art at Puri beach, on the occasion of the 78th Independence Day.
(Video: Sudarsan Pattnaik) pic.twitter.com/wZhzYGZORd
— ANI (@ANI) August 15, 2024
మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. వరుసగా 11వ సారి ఎర్రకోటపై ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం హెలీకాపర్ల ద్వారా పూలవర్షం కురిపించాయి. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇక ఈ సారి వికసిత భారత్ థీమ్‌తో పంద్రాగస్టు వేడుకలను కేంద్రం నిర్వహిస్తున్నది. వేడుకలకు దాదాపు 6వేల మంది ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఎర్రకోట పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
Also Read..
PM Modi | ఈ అవకాశాన్ని వదులుకోకూడదు.. సద్వినియోగం చేసుకోవాలి : ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi | భారత్ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకం : ప్రధాని నరేంద్ర మోదీ
Independence Day | ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ