Kumudini Lakhia : ప్రముఖ కథక్ నృత్యకారిణి (Kathak dancer) కుముదిని లఖియా (Kumudini Lakhia) కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం అహ్మదాబాద్ (Ahmedabad) లోని తన నివాసంలో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కుముదిని గుజరాత్లోని అహ్మదాబాద్లో 1930లో జన్మించారు. కథక్ నృత్య కళారూపాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 1967లో ఆమె అహ్మదాబాద్లో కదంబ సెంటర్ ఫర్ డ్యాన్స్ సంస్థను స్థాపించారు. ఇందులో ఆమె చేసిన కృషికిగాను 2025లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను కూడా కుముదిని అందుకున్నారు.