మైసూర్ : ప్రముఖ కార్టూనిస్ట్ అజిత్ నినన్(68) శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియాలో అజిత్ నినన్ (Ajit Ninan) తన కార్టూన్స్తో పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నారు. అజిత్ తన అపార్ట్మెంట్లో ఈరోజు ఉదయం హఠాన్మరణం చెందారని, గుండెపోటుతో ఆయన మరణించాడని భావిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
అజిత్ నినన్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత రెండేండ్లుగా మైసూర్లో అజిత్ కుటుంబం నివసిస్తుండగా, ఆయన భార్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గోవాలోని కూతురు వద్దకు వెళ్లింది. మరణించిన సమయంలో కార్టూనిస్ట్ ఒక్కరే ఇంట్లో ఉన్నారని కుటుంబసభ్యులు తెలిపారు.
పిల్లల మ్యాగజైన్ టార్గెట్లో డిటెక్టివ్ మూచ్వాలా తన ప్రముఖ కార్టూన్ క్యారెక్టర్లలో ఒకటిగా పేరొందింది. అజిత్ నినన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More :