Instagram | బార్ వెయిటర్ నుంచి ఇన్స్టాగ్రాం హెడ్ వరకూ..! : యువతలో స్ఫూర్తి నింపుతున్న ఆడం మొస్సేరి కెరీర్
ఇన్స్టాగ్రాం (Instagram) బాస్ ఆడం మొస్సేరి కెరీర్ స్ఫూర్తిదాయకంగా సాగుతూ యువతలో స్ఫూర్తి నింపుతోంది.
న్యూఢిల్లీ : ఇన్స్టాగ్రాం (Instagram) బాస్ ఆడం మొస్సేరి కెరీర్ స్ఫూర్తిదాయకంగా సాగుతూ యువతలో స్ఫూర్తి నింపుతోంది. మెటా సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లాం ఇన్స్టాగ్రాం చీఫ్‌గా మొస్సేరి 2018 నుంచి కీలక బాధ్యతలు చేపడుతున్నాడు. మొస్సేరి ఫేస్బుక్ ఎగ్జిక్యూటివ్‌గానూ సేవలందించగా తాజాగా థ్రెడ్స్నూ పర్యవేక్షిస్తున్నాడు. మొస్సేరి అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను అవలీలగా నిర్వహిస్తున్నా టెక్ ప్రొఫెషనల్‌గా ఇన్స్టాగ్రాం చీఫ్‌గా అతడి ప్రస్దానం సాఫీగా సాగలేదు. మొస్సేరి థ్రెడ్స్ రీసెంట్ పోస్టుల్లో తన కెరీర్ ప్రయాణంలో సాగించిన టాప్ ఫైవ్ రోల్స్‌ను ప్రస్తావించాడు.
అవే తన కెరీర్‌ను మలిచి తనను ఇక్కడవరకూ తీసుకొచ్చాయని చెప్పుకొచ్చాడు. మొస్సేరి కెరీర్ తొలి అడుగులు స్టార్టప్‌లు లేదా టెక్ దిగ్గజాల్లో ప్రారంభమయ్యాయనుకుంటే పొరపాటే. మొస్సేరి తొలుత వెయిటర్, బార్ టెండర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. పలు రెస్టారెంట్ జాబ్స్‌లో అనుభవం సంపాదించిన తర్వాత మొస్సేరి తన కెరీర్‌ను డిజైనర్, మేనేజర్ రోల్‌కు మలుచుకున్నాడు. ఆపై అంచెలంచెలుగా ఎదిగిన మొస్సేరి ప్రస్తుతం ఇన్స్టాగ్రాం ప్రోడక్ట్ హెడ్ పొజిషన్‌కు చేరుకున్నాడు. మొస్సేరి 2002లో బ్లాంక్ మొస్సేరి పేరుతో డిజైన్ కంపెనీని లాంఛ్ చేశాడు.
శాన్ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందించాడు. 2007లో మౌలికసదుపాయాలు, ఏపీఐ, టూల్స్‌కు సంబంధించిన టాక్స్బాక్స్లో చేరాడు. 2008లో ఫేస్బుక్ ప్రోడక్ట్ మేనేజర్‌గా మొస్సేరి కెరీర్ మలుపు తీసుకుంది. మెటాలో క్రమంగా ఎదుగుతూ 2018 నుంచి ఇన్స్టాగ్రాం హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హాస్పిటాటిటీ రంగంలో తడబడిన అడుగులతో సాగిన మొస్సేరి కెరీర్ యువతలో స్ఫూర్తి నింపుతుంది. ఆతిధ్య రంగంలోనూ అపార అవకాశాలున్నాయని చాటి చెబుతోంది. చిన్నపాటి ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించే యువత మొస్సేరి కెరీర్ నుంచి గుణపాఠం నేర్చుకోవచ్చు. చిన్న కొలువులు ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు కెరీర్ ఆరంభంలో నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు తగిన వేదికగా మారతాయి.
Read More :
Actor Sathyaraj | సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు.. మంత్రికి మద్దతు తెలిపిన కట్టప్ప
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

