Actor Sathyaraj | సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు.. మంత్రికి మద్దతు తెలిపిన కట్టప్ప
Actor Sathyaraj | సనాతన ధర్మం (Sanatana Dharma)పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ (Actor Sathyaraj) ఉదయనిధికి మద్దతుగా నిలిచారు. ఆయన మాటల్లో తప్పేముందని వ్యాఖ్యానించారు.
Actor Sathyaraj | సనాతన ధర్మం (Sanatana Dharma)పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. స్టాలిన్ వ్యాఖ్యలపై మతపెద్దలు, అర్చకులు, బీజేపీ సహా కొన్ని పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ఉదయనిధికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ (Actor Sathyaraj) ఉదయనిధికి మద్దతుగా నిలిచారు. ఆయన మాటల్లో తప్పేముందని వ్యాఖ్యానించారు.
‘సనాతన ధర్మంపై ఉదయనిధి స్పష్టంగా మాట్లాడారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలను వెల్లడించినందుకు అభినందిస్తున్నాను. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కట్టప్ప కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెబుతున్నారు.
Also Read..
Stock Market | అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలు.. లాభాల్లో దేశీయ సూచీలు..!
G20 Meeting: మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవగౌడకు ఆహ్వానం.. మల్లిఖార్జున్ ఖర్గేకు అందని ఆహ్వానం
Varanasi | కాశీ విశ్వనాథుడికి రికార్డు స్థాయిలో విరాళాలు.. శ్రావణ మాసంలోనే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

