Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన లాభాలతో శుక్రవారం మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇవాళ సెన్సెక్స్ 133 పాయింట్ల లాభంతో 66,398 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 188 పాయింట్లు పెరిగి 66,447.34 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి.. 19,762 వద్ద లాభాల్లో మొదలు కాగా.. ప్రస్తుతం 36.02 పాయింట్ల పెరిగి 19,763 వద్ద ట్రేడవుతున్నది.
ఎల్అండ్టీ, ఎన్టీపీసీ, లార్సెన్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, దివిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.