న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న సమయంలో ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాకు రెమ్‌డెసివిర్ ఏమీ మంత్ర దండం కాదని, ఇది మరణాలను తగ్గించదని ఆయన చెప్పడం గమనార్హం. మరో యాంటీ-వైరల్ డ్రగ్ లేదు కాబట్టే దీనిని వాడుతున్నట్లు చెప్పారు. దీనిని అసలు ఏమాత్రం లక్షణాలు లేని వారికి ఇచ్చినా, కాస్త ఆలస్యంగా ఇచ్చినా ఉపయోగం లేదని రణ్‌దీప్ స్పష్టం చేశారు.
ఆసుపత్రి పాలైన కొవిడ్ పేషెంట్లు, ఆక్సిజన్ సాచురషన్ స్థాయి పడిపోయిన వాళ్లు, చెస్ట్ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో వైరస్ ఉన్నట్లు తేలిన వాళ్లకు మాత్రమే రెమ్‌డెసివిర్ ఇవ్వాలని రణ్‌దీప్ సూచించారు. ఇక స్టెరాయిడ్స్ కూడా బాగానే పని చేస్తున్నట్లు రికవరీ ట్రయల్స్ చూస్తే అర్థమవుతోందని ఆయన చెప్పారు. అయితే అవి ఎప్పుడు ఇవ్వాలన్నది చాలా ముఖ్యమని రణ్‌దీప్ తెలిపారు.
తొలి రోజు నుంచే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి తగ్గిపోయి, మధ్యస్థం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడే వీటిని ఇస్తే ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఆక్సిజన్ స్థాయి పడిపోక ముందే ఇస్తే ప్రమాదం. చాలా త్వరగా స్టెరాయిడ్స్ తీసుకున్న కొవిడ్ పేషెంట్లే ఎక్కువగా చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నట్లు రణ్‌దీప్ గులేరియా వెల్లడించారు.
ఇక ప్లాస్మా థెరపీది కూడా పరిమిత పాత్రే అని చాలా అధ్యయనాలు నిరూపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేవలం 2 శాతం కంటే తక్కువ మంది కొవిడ్ పేషెంట్లకే ఇది అవసరమవుతుందని, అయితే ఈ మధ్య దీనిని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారని రణ్‌దీప్ చెప్పారు.
Remdesivir should only be given to patients who are hospitalised, had fall in oxygen saturation and have infiltrates on the chest X-ray or CT-scan: AIIMS Director Dr Randeep Guleria#COVID19 pic.twitter.com/Xv1XFuTceq
— ANI (@ANI) April 19, 2021
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
గుడ్‌న్యూస్.. నోటి ద్వారా ఇచ్చే రెమ్‌డెసివిర్ అభివృద్ధి చేసిన జుబిలంట్ ఫార్మా
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్‌కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్‌ఖాన్‌తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్‌కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్‌కు యాంజియోప్లాస్టీ