న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్రకు రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లలో ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ఈ యాత్ర ఈ ఏడాది జూలై 3న ప్రారంభమై రక్షాబంధన్ దినమైన ఆగస్టు 9న ముగుస్తుంది. అమర్నాథ్ వెళ్లాలనుకునే భక్తులకు రెండు మార్గాలుంటాయి.