రాంచీ: గత ఎన్నికలలో పోలిస్తే జార్ఖండ్ రాష్ట్రంలో బీజేపీ హవా స్వల్పంగా తగ్గింది. మొత్తం 14 స్థానాల్లో బీజేపీ 8, దాని మిత్రపక్షం ఏజేఎస్యు ఒక స్థానంలో విజయం సాధించగా, కాంగ్రెస్ రెండు, దాని మిత్రపక్షం జేఎంఎం మూడు సీట్లు గెల్చుకున్నాయి.
2019 ఎన్నికల్లో బీజేపీ 11, ఏజేఎస్యూ, కాంగ్రెస్, జేఎంఎం తలా ఒక సీటు గెలిచాయి. ఇక్కడ బీజేపీ నుంచి బరిలోకి దిగిన కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ అర్జున్ ముండా పరాజయం పాలయ్యారు. మరో మంత్రి అన్నపూర్ణ దేవి కొడెర్మలో తన ప్రత్యర్థిపై 1.37 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా సతీమణి, ఎన్నికల ముందు బీజేపీలో చేరిన గీతా కోరా జేఎంఎం అభ్యర్థి చేతిలో ఓటమి దిశగా ఉన్నారు.