Red Fort | ఢిల్లీలోని ఎర్రకోట తాత్కాలికంగా మూసివేత..! కారణమిదే
Red Fort | ఢిల్లీలోని( Delhi) చారిత్రాత్మక ఎర్రకోటను(Red Fort )జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు (నెల రోజులు) మూసి వేయను న్నారు.
ఢిల్లీ : ఢిల్లీలోని( Delhi) చారిత్రాత్మక ఎర్రకోటను(Red Fort )జూలై 15 నుండి ఆగస్టు 15 వరకు (నెల రోజులు) మూసి వేయను న్నారు. ఈ నెల 15 నుండి ఆగస్టు 15 వరకు సాధారణ సందర్శకులు, ప్రజల కోసం మూసివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ASI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎర్రకోట వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పాసులు ఉన్న వారినే లోనికి అనుమతిస్తున్నారు. 2026 ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతీయ వేడుకలు ముగిసిన అనంతరం తిరిగి ఎర్రకోటను పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు.
అప్పటి వరకు పర్యాటకులు సహకరించాలని అధికారులు కోరారు. కాగా, ప్రతి సంవత్సరం దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ప్రధాన వేదికగా నిలుస్తుంది. ఇక్కడే దేశ ప్రధాన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అతిథులు, వేలాది మంది భద్రతా సిబ్బంది, అధికారులు, హాజరవుతారని భావిస్తున్నందున అధికారులు చాలా వారాల ముందు నుండే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

