భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. (Rats in Hospital) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. కమల రాజా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగుల వార్డులో యధేచ్చగా ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మధ్యప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థ పరిస్థితిని చూడండి. గ్వాలియర్‌లోని కమల రాజా ఆసుపత్రిలో రోగుల కంటే ఎక్కువగా ఎలుకలు తిరుగుతున్నాయి. రోగులు, నవజాత శిశువులను ఎలుకల నుంచి రక్షించడానికి గట్టి నిఘా కావాలి. మధ్యప్రదేశ్ దేవుని దయతో ఉంది. పార్చీవాలే ముఖ్యమంత్రి దర్బార్‌లో హాజరు నమోదు చేస్తున్నారు’ అని విమర్శించింది.
కాగా, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై మెడికల్ కాలేజీ డీన్ స్పందించారు. ఎలుకలను నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించినట్లు మీడియాతో అన్నారు.
मध्यप्रदेश की स्वास्थ्य व्यवस्था के हाल देखिए:
ग्वालियर के कमला राजा अस्पताल में मरीजों से ज़्यादा चूहे घूम रहे, मरीजों और नवजात शिशुओं को चूहों से बचाने के लिए करनी पड़ती है कड़ी निगरानी।
मध्यप्रदेश भगवान भरोसे है,
पर्ची वाले मुख्यमंत्री दरबार में हाजिरी लगाने में व्यस्त हैं। pic.twitter.com/xNQ2LouYof— MP Congress (@INCMP) June 10, 2024