500 కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయట!
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్వేరు కేసుల్లో షేర్‌గఢ్, హైవే పోలీసులు 386 కిలో లు, 195 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు
- కోర్టుకు తెలిపిన యూపీ పోలీసులు
- రుజువులు కోరిన ధర్మాసనం
మథుర, నవంబర్ 24: గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్వేరు కేసుల్లో షేర్‌గఢ్, హైవే పోలీసులు 386 కిలో లు, 195 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు గురువారం ప్రత్యేక నార్కోటిక్, డ్రగ్ కోర్టులో విచారణకు వచ్చింది.
స్వాధీనం చేసుకొన్న 586 కిలోల గంజాయిని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకొని గోదాముల్లో నిల్వచేసిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిల్వ చేసిన సరుకులను ఎలుకల బెడద నుంచి రక్షించే పరిస్థితి పోలీస్స్టేషన్లలో లేదని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను ఈ నెల 26లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- confiscated
- court
- Ganja
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

