పూరి: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. ఇందులో రెండో విడత సర్వేను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) శనివారం ప్రారంభించింది.
రత్న భాండాగారంలోని నిధి నిక్షేపాల వెలికితీత, సంపద అన్వేషణకు ఉద్దేశించిన ఈ సర్వే వల్ల మూడు రోజుల పాటు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తోబుట్టువుల దేవతల దర్శనాన్ని భక్తులకు నిషేధించారు. అలాగే ఈ సర్వే సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తారు. ఆలయ రత్న భాండాగారంలో ఏదైనా రహస్య చాంబర్ లేదా సొరంగం ఉన్నదా? అన్న అంశాన్ని ఈ సర్వేలో పరిశీలిస్తారు.