న్యూఢిల్లీ, ఆగస్టు 20: రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్ట్ను కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ప్రారంభించారు.
తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో పైలట్ ప్రాజెక్టు కింద 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అమలయ్యే షాపుల్లో ఇకపై చిరు ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, నిత్యావసరాలు అమ్మవచ్చు.
అందరూ లాభపడేలా ఈ మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎఫ్పీఎస్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ విధానం సరిగా లేదని. .షాపు స్థలాన్ని, పనివారిని సమర్థంగా ఉపయోగించుకొనే ప్రత్యామ్నాయ విధానాలు అవసరమని ఆయన అన్నారు.