Rashtrapati Bhavan | లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ సారధ్యంలో బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ వారంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి భవన్ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రధానితోపాటు కేంద్ర మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనుండటంతో ఈ నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ సాధారణ ప్రజానీకాన్ని రాష్ట్రపతి భవన్లోకి అనుమతి ఇవ్వడం లేదని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ ప్రధాని మోదీ చేస్తారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్రపతిని బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కోరనున్నది. అటుపై ప్రధాని మోదీ సారధ్యంలో కొత్త క్యాబినెట్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారని తెలుస్తోంది.