న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్(Ranveer Singh)కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో దేశ రాజకీయాలపై రణ్వీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఉన్నది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా రణ్వీర్ కామెంట్ చేసినట్లు ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆ వీడియోలో రణ్వీర్ కోరుతున్నట్లుగా ఉన్నది.
ఇటీవల రణ్వీర్ వారణాసి వెళ్లాడు. అయితే అక్కడ రణ్వీర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు ఆ వీడియోలో ఉన్నది. కానీ ఆ వీడియో ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియో అని తెలిసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఆడియోను మార్చివేసినట్లు గుర్తించారు.
ఆన్లైన్ వైరల్ అవుతున్న వీడియోపై రణ్వీర్ కామెంట్ చేశారు. సోషల్ మీడియా అభిమానులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. డీప్‌ఫేక్ సో బచో దోస్తో అంటూ రణ్వీర్ ట్వీట్ చేశారు. డీప్‌ఫేక్ వీడియో గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు రణ్వీర్.