Rameshwaram Cafe | రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు
Rameshwaram Cafe | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది.
Rameshwaram Cafe | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe)లో పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency) తాజాగా అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుడిని బళ్లారికి చెందిన షబ్బీర్‌గా గుర్తించినట్లు తెలిపాయి. ఎన్ఐఏ అధికారులు ప్రస్తతుం నిందితుడిని కస్టడీలోకి తీసుకొని (Key suspect taken into custody) విచారిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.
బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1 శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడులో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించి కేఫ్‌కు వచ్చినట్లు గుర్తించారు. కేఫ్‌లో పేలుడు జరిగిన గంట తర్వాత అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్లో తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షల రివార్డు కూడా ఇస్తామని ఎన్ఐఏ ఇప్పటికే ప్రకటించింది. దాదాపు ఘటన జరిగిన 13 రోజులకు ప్రధాన నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
Japan Private Satellite | లాంచ్ చేసిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.. VIDEO
Water Crisis | నెలకు ఐదు సార్లే స్నానం.. వంట వండుకోకుండా ఫుడ్ ఆర్డర్.. బెంగళూరు ప్రజల నీటి కష్టాలు
Hijack | హిందూ మహాసముద్రంలో బంగ్లాదేశ్ నౌక హైజాక్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

