Road Accident | జమ్ము కశ్మీర్ రాంబన్ (Ramban) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఉఖ్రాల్ పోగల్ పారిస్థాన్ తహసీల్ (Ukhral Pogal Paristan Tehsil) ప్రాంతంలో టాటా సుమో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
సుమో అదుపు తప్పి 600 అడుగుల లోతైన లోయలోకి పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. వారిని ఉఖ్రాల్ పీహెచ్‌సీకి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మిగతా నలుగురిని ఎస్డీహెచ్ బనిహాల్‌కు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు కూడా మరణించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంపై 15 పేజీల రిపోర్టు.. ఆ నివేదికలో ఇవే కీ పాయింట్స్
Chirag Paswan | నిన్ను చంపేస్తాం.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బెదిరింపులు