Ayodhya Ram Mandir | భారతీయుల ఎన్నో దశాబ్దాల కల సాకారమైంది. జన్మభూమిలోని మందిరంలో బాల రాముడు కొలువుదీరి పూజలందుకున్నాడు. రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్ ప్రపంచ దృష్టి అయోధ్యపైనే నెలకొన్నది. ఈ క్రమంలో గూగుల్ ట్రెండ్స్‌లో అయోధ్య రికార్డుబద్దలు కొడుతూ చరిత్ర సృష్టించింది. అయోధ్య నగరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గూగుల్ అత్యధికంగా రాముడు, అయోధ్య, ప్రాణ ప్రతిష్ఠ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. గూగుల్ ట్రెండ్ (google.com/trends/trendingsearches)లో టాప్ సెర్చ్లన్నీ రామ మందరానికి సంబంధించినవే ఉండడం దాదాపు ఇదే తొలిసారి.
గతంలో గత 24 గంటల్లో ఈ తరహాలో ట్రెండ్స్ కనిపించకపోవడం గమనార్హం. గత 24 గంటల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాల్లో అయోధ్య, హిందూ దేవాలయం, రామ, హారతి, భారతీయ జనతా పార్టీ, అయోధ్య, నరేంద్ర మోదీ, బాబ్రీ మసీద్ కూల్చివేత, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆచార్య ప్రమోద్ కృష్ణం, ప్రాణ ప్రతిష్ఠ, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ తదితర అంశాలపై నెటిజన్స్ గూగుల్‌లో తెగ వెతికారు. వీటితో పాటు రామ మందిరం ప్రతిష్ఠ సమయం, అయోధ్య ప్రత్యక్ష ప్రసారం, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ శుభాకాంక్షలు, రామమందిరం శుభాకాంక్షలు గురించి సెర్చ్ చేశారు. ఇదిలా ఉండగా.. 5 ఆగస్టు 2020న రామమందిరానికి మోదీ శంకుస్థాపన చేసిన తెలిసిందే. ఈ సమయంలోనూ అయోధ్య రామ మందిరం గూగుల్‌లో ట్రెండ్ అయ్యింది.