భారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు.. యూపీలో మార్పులకు సంకేతాలన్న జైరాం రమేష్
ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేప్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రామమందిర్ ట్రస్ట్ మద్దతు ప్రకటించింది. అలాగే ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించిన ఈ యాత్రకు బీజేపీ కార్యాలయం సిబ్బంది స్వాగతం పలికారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మార్పులకు సంకేతమా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భాగ్పత్లోని బరౌలీలోని బీజేపీ కార్యాలయం మీదుగా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సాగుతుండగా అక్కడ ఉన్న బీజేపీకి చెందిన వారు స్వాగతం పలికారంటూ ట్వీట్ చేశారు. అలాగే రామ మందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్, రామ్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కూడా ఇటీవల రాహుల్ గాంధీని అభినందిస్తూ ఇచ్చిన మద్దతు లేఖ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
‘భారత్ జోడో యాత్రను స్వాగతిస్తూ అయోధ్య రామ మందిరం ప్రధాన పూజారి ఇటీవల లేఖ రాశారు. వీహెచ్పీ నేతలైన చంపత్ రాయ్ వంటి నేతలు రాహుల్ గాంధీని ప్రశంసించారు. దీని తర్వాత ఇవాళ భాగ్పత్లోని బరౌలీలో బీజేపీ కార్యాలయంలో ఉన్న వారు ఉత్సాహంగా చేతులు ఊపుతూ యాత్రకు స్వాగతం పలికారు’ అని జైరాం రమేష్ హిందీలో ట్వీట్ చేశారు. సీఎం యోగి రాష్ట్రంలో మార్పుల వాతావరణానికి సంకేతమా? అని ప్రశ్నించారు.
अयोध्या राम मंदिर के मुख्य पुजारी के #BharatJodoYatra के स्वागत में लिखे गए पत्र और चंपत राय जैसे VHP नेताओं की @RahulGandhi की तारीफ़ के बाद आज बागपत के बरौली में BJP कार्यालय से उत्साह के साथ हाथ हिलाकर यात्रियों का अभिवादन किया गया।
योगी के प्रदेश में जलवायु परिवर्तन के संकेत?— Jairam Ramesh (@Jairam_Ramesh) January 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

