Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర్ విరాళాల చోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. విరాళాలు కాజేసిన నిందితులు పట్టుబడేంత వరకు పదవిలో కొనసాగబోనని జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ (Champat Rai), కోశాధికారి అనిల్ మిశ్రాలు సమర్పించిన రాజీనామాను ట్రస్ట్ ఆమోదించింది. అనంతరం ట్రస్టీ సభ్యుల్లో ఒకరైన మధ్యంతర కార్యదర్శిగా కృష్ణ మోహన్(Krishna Mohan)ను నియమించింది. త్వరలోనే సంస్థాగత సమీక్ష అనంతరం తాత్కాలిక కోశాధికారి పేరును కూడా వెల్లడిస్తామని ట్రస్టీ తెలిపింది.
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో సోమవారం శ్రీ రామజన్మభూమి క్షేత్ర ట్రస్ట్ మూడుగంటలకు పైగా సమవేశమైంది. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించిన ట్రస్టీ తాత్కాలిక కార్యదర్శిగా కృష్ణ మోహన్‌ను నియమించింది. అనంతరం ట్రస్ట్ కోశాధికారి స్వామీ గోవింద్ దేవ్ గిరి మీడియాతో మాట్లాడుతూ రామ మందిర్ విరాళాల చోరీ ఘటన తమ సంఘాన్ని తీవ్రంగా బాధించిందని చెప్పారు.
#WATCH | Ayodhya, UP: Krishna Mohan, a trustee of the Shri Ram Janmabhoomi Tirtha Kshetra Trust, says, “I have been entrusted with the responsibility of discharging the duties of General Secretary in an acting capacity until a new General Secretary is appointed. Anyone found… pic.twitter.com/cdbutYjFll
— ANI (@ANI) July 6, 2026
‘రామమందిర్ విరాళాల చోరీ మమ్మల్ని చాలా బాధించింది. పెద్దమొత్తం కాజేశారా? చిన్న మొత్తమా? అనేది రెండో విషయం. అంతకంటే ముఖ్యంగా అలాంటి పవిత్రమైన చోట విరాళాల చోరీ జరగడం మమ్మల్ని క్షోభకు గురి చేస్తోంది’ అని గోవిద్ దేవ్ గిరి ఆవేదన వ్యక్తం చేశారు. విరాళాల చోరీకి బాధ్యులైన వారిని పట్టుకునేంతవరకు తాను కార్యదర్శిగా కొనసాగడం సమంజసం కాదని చంపత్ రాయ్ రాజీనామా చేశారని ఆయన పేర్కొన్నారు.
Ayodhya:
Ram Mandir trust member Krishna Mohan, VHP Central General Secretary Bajrang Bhangra, VHP Central Advisor Dinesh Chandra arrive to meet with Ram Mandir trust’s Treasurer Govind Devgiri over fund theft. pic.twitter.com/vv6sl3XehJ
— News Arena India (@NewsArenaIndia) July 6, 2026
‘ట్రస్ట్ రాజ్యాంగం ప్రకారం రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించం వంటివి ఎక్కువ రోజులు మా చేతుల్లో ఉండవు. రాజీనామాను వెంటనే ఆమోదిస్తాం. మాకు వేరే దారి లేదు’ అని గోవింద్ దేవ్ గిరి తెలిపారు. జూలై 22వ తేదీన మరోసారి సమావేశం అవుతామని ట్రస్ట్ వెల్లడించింది. ఈ సమావేశంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన తుది నివేదికను సమీక్షిస్తామని, ఆ తర్వాత కొత్త సభ్యులను, కార్యవర్గాన్ని నియమిస్తాని తెలిపింది. అప్పటివరకూ మధ్యంతర కార్యదర్శి కృష్ణ మోహన్ అన్ని బాధ్యతలు చూసుకుంటారని ట్రస్ట్ స్పష్టం చేసింది.