Ayodhya Ram Mandir | రాత్రి సమయంలో రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలు షేర్ చేసిన ట్రస్ట్
Ayodhya Ram Mandir | జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయం నైట్ వ్యూకి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
Ayodhya Ram Mandir | కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల కోసం జగదభిరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండటంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆలయం నైట్ వ్యూకి సంబంధించిన చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను షేర్ చేసింది. రాత్రి వేళ కూడా ఈ ఆలయం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
Ram Janmbhoomi Teerth Kshetra Trust shares pictures of Ram Temple premises as it looks during the night. pic.twitter.com/2RPXVUBebA
— ANI (@ANI) January 8, 2024
సాంప్రదాయ నాగర్ శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2500 ఏండ్లు నిలిచి ఉండే అద్భుత ఆధ్యాత్మిక కట్టడం.. ఇనుము వాడకుండా ప్రత్యేక శిలలతో అందంగా నిర్మాణం.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ ఆలయం.. భారతీయ సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు రూపం.. ఇలా ఎన్నో విశిష్టతలతో ఈ భవ్య రామ మందిరం రూపుదిద్దుకుంటోంది.
Also Read..
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి
HanuMan | రామ మందిరానికి ‘హనుమాన్’ చిత్ర బృందం విరాళం.. ప్రతి టికెట్పై 5 రూపాయలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

