Ram Mandir | సీతమ్మ వారికి సూరత్ నుంచి స్పెషల్ చీర.. ప్రాణప్రతిష్ఠ వేళ బనారసీ చీరలకు పెరిగిన డిమాండ్
Ram Mandir | దేశంలోని గుజరాత్ (Gujarat) సూరత్ (Surat) చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా సూరత్ చీరలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. చాలా మంది ప్రత్యేక సందర్భాల్లో సూరత్‌కు వెళ్లి చీరలను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా రామ మందిరం ప్రారంభోత్సవం వేళ సూరత్ వ్యాపారులు ప్రత్యేక చీరలను తయారు చేస్తున్నారు.
Ram Mandir | దేశంలోని గుజరాత్ (Gujarat) సూరత్ (Surat) చీరలకు ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా సూరత్ చీరలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. చాలా మంది ప్రత్యేక సందర్భాల్లో సూరత్‌కు వెళ్లి చీరలను కొనుగోలు చేస్తుంటారు. తాజాగా రామ మందిరం ప్రారంభోత్సవం వేళ సూరత్ వ్యాపారులు ప్రత్యేక చీరలను తయారు చేస్తున్నారు. అందులో సీతమ్మ (Sita) వారి కోసం ప్రత్యేక చీర రూపొందించారు. ఆ చీరపై రాముడు, అయోధ్య ఆలయ చిత్రాలను ముద్రించి ప్రత్యేకంగా తయారు చేశారు. టెక్స్టైల్స్ పరిశ్రమ తరపున లలిత్ శర్మ.. సీతమ్మ వారి కోసం తయారు చేసిన మొదటి కానుకను అందజేశారు.
బనారసీ చీరలకు డిమాండ్..
మరోవైపు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకల వేళ బనారసీ చీరలకు (Banarasi saree) డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా రామ మందిరం థీమ్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేసివ్వాలంటూ మహిళల నుంచి కార్మికులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ పూజలకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా రామ మందిరం థీమ్ తో నేసిన చీరలు ధరించాలని మహిళలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే బనారస్ లోని వ్యాపారులకు ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. చీరల కొంగులపై రామ మందిర చిత్రాలు ఉండాలని, శ్రీరాముడి బాల్యం నుంచి రావణసంహారం దాకా రామచరితలోని వివిధ ఘట్టాలను చిత్రించాలని, శ్రీరామ నామాలు ఉండాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. క్వాలిటీ, డిజైన్‌ను బట్టి చీర ధర రూ.7 వేల నుంచి రూ.లక్ష వరకూ అమ్ముతున్నట్లు వెల్లడించారు.
Also Read..
HanuMan | రామ మందిరానికి ‘హనుమాన్’ చిత్ర బృందం విరాళం.. ప్రతి టికెట్‌పై 5 రూపాయలు
Cold Wave | ఢిల్లీ గజగజ.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు.. మరో రెండు రోజుల్లో పెరగనున్న చలితీవ్రత
Chiranjeevi | రామాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తా : చిరంజీవి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

