న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా విపక్షాలు దాఖలు చేసిన అభిశంసన తీర్మానం నోటీస్‌ను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కేంద్రంలోని అధికార బీజేపీ పట్ల అనుకూల వైఖరి కనబరుస్తున్నారని, విపక్ష పార్టీలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 63 మంది ఎంపీలు మార్చి 12న అభిశంసన తీర్మాన నోటీస్‌ను లోక్‌సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఆయన్ని సీఈసీ పదవి నుంచి తొలగించాలని ఆ నోటీస్‌లో కోరారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రధానంగా ఏడు ఆరోపణలు చేశారు. కేంద్రంలోని బీజేపీకి లబ్ధిచేకూరేలా దేశవ్యాప్తంగా ‘సర్’ ప్రక్రియను ఈసీ చేపడుతున్నదన్నది విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ.