అలప్పుజ: దేశంలో ప్రాథమిక విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాధిరాజ సైనిక్ స్కూల్ 47వ వార్షికోత్సవాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సైనిక్ స్కూళ్లలో బాలికల ప్రవేశాలకు మార్గం సుగమం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు సైనిక్ స్కూళ్లను విస్తరించాలని నిర్ణయించిందన్నారు. అన్ని ప్రాంతాలు, వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాలు గల వారిని ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.