సోమవారం 25 జనవరి 2021
National - Jan 05, 2021 , 14:57:11

సీనియ‌ర్ నేత‌కు ర‌క్ష‌ణ మంత్రి‌ బ‌ర్త్‌డే విషెస్‌

సీనియ‌ర్ నేత‌కు ర‌క్ష‌ణ మంత్రి‌ బ‌ర్త్‌డే విషెస్‌

న్యూఢిల్లీ: బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషికి ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి పుట్టిన‌రోజు నేప‌థ్యంలో ఇవాళ‌ ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ స్వ‌యంగా ఆయ‌న నివాసానికి వెళ్లి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌నకు పుష్ప గుచ్ఛాన్ని అందించి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అనంత‌రం నేత‌లిద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నారు. రాజ‌కీయ అంశాల‌తోపాటు వ్య‌క్తిగ‌త అంశాలు కూడా ఈ సంద‌ర్భంగా వారి మ‌ధ్య చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo