హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఈటల రాజేందర్‌కు భయపడాల్సి న పనిలేదని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సిటీ సెంటర్‌హాల్‌లో ఉద్యమ నాయకుడు పోచమల్లుయాదవ్ టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కెప్టెన్ మాట్లాడారు. ప్రతి కార్యకర్త ఈటలను ఓడగొట్టడానికి కంకణం కట్టుకో వాలన్నారు.

తిన్నింటివాసాలు లెక్కపెట్టడం ఈటలకు అలవాటైపో యిందని, తెలంగాణ రాష్ర్టానికి సహకరించని కేంద్రంలో ఉన్న బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో ఆయనను పాతాల లోకానికి తొక్కి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. – రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ. లక్ష్మీకాంతారావు
నన్ను ఎదుగకుండా చేసిండు..
నేను 1981లో నక్సలైట్ ఉద్యమంలో చేరి 2002లో లొంగిపోయిన. రెండేళ్లు ఖాళీగానే ఉన్న. 2014ల జమ్మికుంట పట్టణంలో కృష్ణాష్టమి వేడుక లు నిర్వహించిన. దానికి పెద్ద ఎత్తున జనం వచ్చిన్రు. అప్పటికే ఎమ్మెల్యే అయిన ఈటల రాజేందర్ ఇది చూసిండు. నాకు ప్రజల్లో పేరు వస్తుందని మనసులో పెట్టుకున్నడు. అప్పటి సంది మొన్నటి మంత్రి పదవి పోయే వరకు ఏదో రకంగా తిప్పలు పెట్టిండు. నన్ను ఎదగకుండా చేసిండు.

దామో దర్రెడ్డిపై పోటీ చేసిన సమయంలో నేను తల్చుకుంటే ఈటల రాజేందర్ గెలిచేవాడు కాదు. నాకు గింత కష్టం వచ్చేది కాదు. అంటూ ఉద్యమకారుడు పొలవేని పోచమల్లు యాదవ్ కంటతడి పెట్టాడు. లక్ష్మీకాంతారావు దయతో తాను బతికి బట్టకట్టానని, ఇప్పటి నుంచి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం కష్టపడుతానని చెప్పాడు. -పొలవేణి పోచమల్లు యాదవ్, ఉద్యమకారుడు