కోచింగ్ మాఫియాను అణిచివేస్తాం : కోట ఆత్మహత్య కేసులపై రాజస్ధాన్ మంత్రి
కోచింగ్ సెంటర్లు డబ్బు దండుకునే కేంద్రాలుగా మారాయని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ అన్నారు. కోటలోని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ల్లో విద్యార్ధుల ఆత్మహత్య కేసులు పెరుగుతుండటం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
జైపూర్ : కోచింగ్ సెంటర్లు డబ్బు దండుకునే కేంద్రాలుగా మారాయని రాజస్ధాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియవస్ అన్నారు. కోటలోని కోచింగ్ ఇనిస్టిట్యూట్‌ల్లో విద్యార్ధుల ఆత్మహత్య కేసులు పెరుగుతుండటం పట్ల మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్ధాన్‌లోని కోచింగ్ ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు అత్యంత సంపన్నులని, అయితే వారు డబ్బు కోసం విద్యార్ధులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే వారి సంస్ధలు ఖాళీ అవుతాయని మంత్రి హెచ్చరించారు.
ఈ తరహా కోచింగ్‌తో మీ పిల్లలు ముందుకు పోలేరని తాను తల్లితండ్రులకు చెబుతున్నానని అన్నారు. పిల్లలు ఎంతో తెలివైనవారని, కానీ తల్లితండ్రులు కోచింగ్ సంస్ధల నిర్వాహకులకు డబ్బు ఇస్తుంటే వారు మాత్రం మీ పిల్లలను వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. ప్రతి క్షణం, ప్రతి మూడురోజులకు ఒకసారి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన కోచింగ్ సంస్ధలను నిలదీశారు.
నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్)కు హాజరయ్యే అభ్యర్ధి ఆదివారం కోటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది కోచింగ్ హబ్‌గా పేరొందిన కోటలో తనువు చాలించిన 23వ ఆత్మహత్య కేసు ఇది కావడం గమనార్హం. కోచింగ్ సెంటర్లను మాఫియాగా అభివర్ణించిన ఆయన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. మన చిన్నతనంలో కోచింగ్ లేకున్నా అప్పట్లో డాక్టర్లు, ఐపీఎస్‌లుగా తయారుకాలేదా అని ప్రశ్నించారు. కోచింగ్ పేరుతో మాఫియా వెలిసిందని, ఈ మాఫియా ఆగడాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.
Read More :
Reliance Industries: రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా.. ఎంట్రీ ఇచ్చిన ముఖేశ్ అంబానీ పిల్లలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

