జైపూర్: సహజీవనం ద్వారా జీవితాన్ని గడపాలనుకునే యువతకు సంబంధించి రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసు రానప్పటికీ ఇద్దరు వయోజనులు పరస్పర అంగీకారంతో సహజీవనం చేయవచ్చునని పేర్కొంది.
ప్రాథమిక హక్కుల వర్తింపులో వివాహ వయసు కాదు, యుక్తవయసు (అడల్ట్హుడ్) ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది. రాజస్థాన్లోని కోటాకు చెందిన 18 ఏండ్ల యువతి, 19 ఏండ్ల యువకుడు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ అనూప్ దండ్ ఈ తీర్పు చెప్పారు.