జైపూర్ : లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ మాలవ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కాషాయ తీర్ధం స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ అనుసరిస్తున్న విలువలకు ఆకర్షితులై ప్రముఖ గిరిజన నేత మహేంద్రజిత్ సింగ్ మాలవ్య కాషాయ పార్టీలో చేరుతున్నారని రాజస్ధాన్ బీజేపీ చీఫ్ సీపీ జోషీ తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో గిరిజన ప్రాంతాల్లో గణనీయ అభివృద్ధి చోటుచేసుకుందని మాలవ్య స్వయంగా వెల్లడించారని చెప్పారు. ఆదివాసీ మహిళన దేశానికి రాష్ట్రపతిగా ఎంపిక చేయడం మోదీ సమర్ధ నాయకత్వానికి ప్రతీకని మాలవ్య పేర్కొనడం ప్రశంసనీయమని అన్నారు.
ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్ధితి ఎదురవుతోందని పార్టీని వీడేముందు మాలవ్య ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విలువలను కోల్పోయి కొద్దిమంది చేతుల్లో బందీగా ఉందని అన్నారు. మాలవ్య కొంతకాలంగా కాంగ్రెస్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం బన్స్వర జిల్లా బగిదొర అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Read More :
Hanuman | ఆంజనేయుడికి సిందూరంపై అంత ప్రీతి ఎందుకు?