Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి లాల్‌చంద్ కటారియా ఆదివారం బీజేపీలో చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు, నాయకత్వానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరానని పేర్కొన్నారు.
దేశం కోసం ప్రధాని మోదీ కష్టపడి పనిచేస్తున్న తీరు తనను ఆకట్టుకుందని అన్నారు. అంతర్జాతీయ వేదికపైనా మోదీ నాయకత్వంలో భారత్ పురోగతి సాధిస్తోందని వ్యాఖ్యానించారు. మోదీ నాయకత్వంలో నాయకుడిగా కాకుండా కార్యకర్తలా పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వ విధానాలను తాను ముందుకు తీసుకువెళతానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన మరో ప్రముఖ నేత రిజు ఝన్‌ఝన్‌వాలా కూడా బీజేపీలో చేరారు. తాను వ్యక్తిగత ప్రయోజనాల కోసం బీజేపీలో చేరడం లేదని దేశ అభివృద్ధి కాంక్షిస్తూ కాషాయ పార్టీలో చేరానని తెలిపారు. రాజస్ధాన్ సీఎం భజన్ లాల్ శర్మ సమక్షంలో కాంగ్రెస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరారు.
Read More :