కాంగ్రెస్ మునిగే నావ..గెలుపుపై నమ్మకం లేక అభ్యర్ధుల మార్పు : బీజేపీ
కాంగ్రెస్ పార్టీపై రాజస్ధాన్ సీఎం, బీజేపీ సీనియర్ నేత భజన్‌లాల్ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై విశ్వాసం సన్నగిల్లిందని, ఆ పార్టీ పదేపదే అభ్యర్ధులను మార్చేస్తోందని ఆరోపించారు.
జైపూర్ : కాంగ్రెస్ పార్టీపై రాజస్ధాన్ సీఎం, బీజేపీ సీనియర్ నేత భజన్‌లాల్ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి గెలుపుపై విశ్వాసం సన్నగిల్లిందని, ఆ పార్టీ పదేపదే అభ్యర్ధులను మార్చేస్తోందని ఆరోపించారు. చిన్నాచితకా పార్టీలతో కాంగ్రెస్ కూటమి కడుతోందని ఎద్దేవా చేశారు. మునిగే నావలాంటి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాజస్ధాన్‌లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తాను కాషాయ పార్టీలో చేరకుంటే తనను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేసిన వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తోసిపుచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సంజయ్ సింగ్, విజయ్ నాయర్, మనీష్ సిసోడియాలకు కోర్టులు బెయిల్ నిరాకరించాయని, అయితే ఆప్ నేతలు మాత్రం బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారని అన్నారు.
బీజేపీతో చేతులు కలిపి కోర్టులు ఇదంతా చేస్తున్నాయని వారు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ఆప్ నేతల దగ్గర సరైన ఆధారాలుంటే వాటిని చూపి కోర్టులు తమకు ఉపశమనం కలిగించేలా ఎందుకు వారు ప్రయత్నించరని బీజేపీ నేత నిలదీశారు.
Read More :
Mercedes Car: కచోరీ షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురికి గాయాలు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

