Mercedes Car: కచోరీ షాపులోకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురికి గాయాలు.. వీడియో
Mercedes Car: ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న ఫేమస్ ఫతే కచోరీ షాపులోకి మెర్సిడీజ్ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న ఫేమస్ ఫతే కచోరీ షాపులోకి మెర్సిడీజ్ కారు( Mercedes Car) దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. షాపులో ఉన్న సీసీటీవీ కెమెరాలకు ఆ ఘటన చిక్కింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కస్టమర్లతో నిండికుపోయిన కచోరీ షాపులోకి ఒక్కసారిగా కారు దూసుకువచ్చింది. అయితే ఆ సమయంలో కచోరీ తింటున్న కస్టమర్లు ఎటూ కదలలేకపోవడంతో పలువురికి గాయాలు అయ్యాయి. కారు అతివేగంగా రావడంతో.. షాపులో ఉన్న టేబుల్స్ ఎగిరిపడ్డాయి. కొందరు కస్టమర్లు కూడా కిందపడిపోయారు. ఓ గోడను ఢీకొన్న తర్వాత ఆ కారు ఆగింది.
36 ఏళ్ల లాయర్ పరాగ్ మయిని అనే వ్యక్తి ఆ కారును డ్రైవ్ చేస్తున్నాడు. నోయిడా నివాసి అతను. ప్రమాదం స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు కింద అతన్ని అరెస్టు చేశారు. మెర్సిడీజ్ కారును కూడా సీజ్ చేశారు. అయితే డ్రైవర్ మద్యం తీసుకోలేదని గుర్తించారు. కానీ స్టడీ కోసం అతని బ్లడ్ శ్యాంపిల్స్ తీసుకున్నారు. ప్రమాద సమయంలో అతని భార్య కారులోనే ఉన్నది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రిలో చేర్పించారు.
#WATCH : Cctv footage of a speeding car rams into kachori shop near Rajpur Road, Delhi.#Delhi #SpeedingCar #CarAccident #CCTV #RoadAccident #Accident #DelhiAccident pic.twitter.com/EPgpKPHgOY
— upuknews (@upuknews1) April 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

