జైపూర్ : యూపీలో రాజకీయ నేతగా మారిన గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ ఆయన సోదరుడు ఆష్రఫ్‌లను శనివారం రాత్రి పోలీస్ కస్టడీలో ఉండగా దుండగులు కాల్చిచంపిన ఉదంతంపై రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోట్ స్పందించారు. శాంతి భద్రతల పరిస్ధితి అదుపు తప్పినప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయని గెహ్లోట్ వ్యాఖ్యానించారు.
యూపీలో ఏం జరుగుతున్నదో దేశం గమనిస్తోందని, శాంతి భద్రతలు సజావుగా లేనప్పుడే ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటాయని అన్నారు. ప్రజలందరి సమక్షంలో ఓ వ్యక్తిని చంపడం సులభమేనని, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటం కష్టమని గెహ్లోట్ పేర్కొన్నారు. కాగా, ఉమేశ్‌పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ అతీ అహ్మద్ (gangster-politician Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను (Ashraf Ahmed) శనివారం రాత్రి 10 గంటల సమయంలో వైద్యపరీక్షల నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలీజీకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Read More
144 Section | గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హత్య.. ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్