జైపూర్: బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చొక్కా కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎదుటే ఒకరి చెంపలు మరొకరు వాయించుకున్నారు. (BJP leaders’ Fight) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం జైపూర్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా సమావేశం జరిగింది. రాష్ట్ర బీజేపీ చీఫ్ మదన్ రాథోడ్, ఇతర పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు.
కాగా, ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మదన్ రాథోడ్‌ను వేదికపైకి తీసుకెళ్లేందుకు మైనారిటీ విభాగం నేత జాకీ ప్రయత్నించారు. అయితే మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జావేద్ ఖురేషి ఆయనను నిలువరించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మరోవైపు ఇది ముదిరి ఘర్షణకు దారి తీసింది. దీంతో జావేద్ ఖురేషి, జాకీ ఒకరి కాలర్లు మరొకరు పట్టుకున్నారు. ఒకరి చెంపపై మరొకరు కొట్టుకున్నారు. తలలతో తన్నుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల ముందే ఫైట్ చేసుకున్నారు. చివరకు కొందరు నేతలు జోక్యం చేసుకుని వారిద్దరినీ విడిపించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
VIDEO | A ruckus broke out between members of BJP’s minority front during a meeting at party office in Jaipur earlier today. More details awaited.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/dv5TRAShcC) pic.twitter.com/CkeCguxUMw
— Press Trust of India (@PTI_News) February 27, 2025