న్యూఢిల్లీ : మేఘాలయా హనీమూన్ మర్డర్(Honeymoon Murder) కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది. ఆ జర్నీకి వెళ్లేముందు రాజా రఘువంశీ.. సుమారు పది లక్షల ఖరీదైన బంగారాన్ని వంటికి ధరించినట్లు తెలుస్తోంది. దాంట్లో ఓ డైమండ్ రింగ్, గోల్డ్ చైన్, బ్రేస్లెట్ ఉన్నాయి. రాజా రఘువంశీ తల్లి ఉమా రఘవంశీ మీడియా మరికొన్ని విషయాలను వెల్లడించారు. మేఘాలయా ట్రిప్‌కు చెందిని అన్ని బుకింగ్ సోనమ్ చేసినట్లు చెప్పింది, ట్రావెల్, బస .. అన్నీ ఆమే బుక్ చేసిందన్నారు. కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు. గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిల్లాంగ్ వెళ్లారో తెలియదన్నారు.
హనీమూన్ ట్రిప్‌కు వెళ్తున్న సమయంలో బంగారు ఆభరణాలు ధరించి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. తన పేరెంట్స్ ఇంటి నుంచి నేరుగా సోనమ్ ఎయిర్‌పోర్టుకు వెళ్లింది. కానీ రాజా రఘువంశీ మాత్రం సుమారు 10 లక్షల ఖరీదైన ఆభరణాలను ధరించి టూర్‌కు వెళ్లాడు. సోనమ్ కోరడం వల్లే రాజా ఆ ఆభరణాలు వేసుకున్నట్లు తల్లి ఉమా తెలిపారు. ఒకవేళ ఈ మర్డర్ కేసులో సోనమ్ పాత్ర ఉంటే ఆమెను ఉరి తీయాలని, సోనమ్ దొరికినట్లు పోలీసులు చెప్పలేదని, సీబీఐ విచారణ చేపట్టాలని, సోనమ్ పాత్ర లేకుంటే ఆమెను నిందించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ తన కుమారుడిని సోనమ్ ఇష్టపడి ఉంటే, ఆమె ఎందుకు అతన్ని వదిలి వేచ్చేదని ప్రశ్నించారు. ఆమె సురక్షితంగా ఎలా వచ్చారో తెలియాలని, అందర్నీ శిక్షించాలని ఉమ కోరారు.
Also Read..