Job Reservations For Locals : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ స్ధానికులకే ఉద్యోగాలనే నినాదానికి ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదును పెడుతున్నారు. కుల వివాదాలకు తావు లేకుండా స్ధానిక యువతకు ఉద్యోగాలు దక్కాలని అన్నారు. బయటి వ్యక్తులకు అందలం దక్కేందుకు మన యువతకు విద్యా, ఉద్యోగావకాశాలను పణంగా పెడుతున్నారని విమర్శించారు.
ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్ధల్లో రిజర్వేషన్లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. విద్యా, ఉద్యోగాల కోసం దేశం నలుమూల నుంచీ ప్రజలు ఇక్కడకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అవే అవకాశాలను స్ధానిక యువతకు ఎందుకు నిరాకరిస్తున్నారని రాజ్ ఠాక్రే నిలదీశారు. స్ధానికులకు ఉపాధి కల్పించేందుకు తగినన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సవ్యంగా సమకూరిస్తే మహారాష్ట్రలో ఎలాంటి కోటాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడకు వచ్చి విద్యావకశాలతో పాటు పనులు చేసుకుంటున్నారని అన్నారు. వనరుల్లో సింహభాగం బయటి వ్యక్తులపై వెచ్చిస్తున్నారని, నగర మౌలిక వసతులన్నీ వారి కోసమే సమకూర్చినట్టు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్ధితులతో స్ధానిక యువతీ, యువకులు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు చెందిన వారికి నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు.
Read More :
Pushpa 2 The Rule | క్లైమాక్స్‌కు వచ్చేసిన ‘పుష్ప 2’.. గూస్బంప్స్ పక్కా.!