Allu Arjun Pushpa Climax Shoot | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇన్ని రోజులుగా పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది చిత్రయూనిట్. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్‌కు, దర్శకుడు సుకుమార్‌కి మధ్య గొడవలు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు.. దీంతో అల్లు అర్జున్ సుకుమార్ మీద ఉన్న కోపంతో తన గడ్డం తీసేసి ట్రిప్‌కు చెక్కేసారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు ఫేక్ అని చిత్రబృందం తర్వాత క్లారిటీ ఇచ్చింది.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉందని ప్రస్తుతం అల్లు అర్జున్‌తో క్లైమాక్స్ కోసం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నట్లు.. గూస్ బంప్స్ పక్కా అంటూ చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా రాసుకోచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
Shoot Update :#Pushpa2TheRule is currently shooting a spectacular action episode for the climax🔥🔥#Pushpa2TheRule Grand release worldwide on 6th DEC 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/X5haaasHAj
— Pushpa (@PushpaMovie) August 5, 2024
Also Read..
Aryan Khan | బ్రెజిల్ నటితో ఆర్యన్ ఖాన్ డేటింగ్?.. వీడియో వైరల్
Pakistan posters | ఓ వ్యక్తి ఇంట్లో పాకిస్థాన్ అనుకూల నినాదాలు.. ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు : కేటీఆర్