Jagityal : జగిత్యాల జిల్లాలో ఒకే నంబర్ ప్లేట్తో తిరుగుతున్న రెండు వాహనాలను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.
జిల్లా ఆర్టీవో శ్రీనివాస్ (RTO Srinivas) ఆదేశాల మేరకు శనివారం రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓకే నెంబర్ ప్లేట్(AP28 TV 0897)తో రెండు టాటా ఏస్ (TATA Ace) వాహనాలు ఉండడం గమనించారు. ఈ రెండిటిని సీజ్ చేశామని అధికారులు తెలిపారు.
అనతంరం డ్రైవర్లను విచారించగా.. ఒకే నంబరున్న ఆ వెహికల్స్ను పిల్లలను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. రవాణా శాఖ నిబంధనలను ఉల్లఘించినట్టు గుర్తించిన అధికారులు సీజ్ చేసిన ఆ రెండు వాహనాలను జగిత్యాల బస్ డిపోకు తరలించారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు అభిలాష్, రియాజ్, కానిస్టేబుల్ రవి, హోంగార్డు అశోక్, సునీల్ పాల్గొన్నారు.