Richard Nagavara : జింబాబ్వే క్రికెట్లో నవశకం మొదలైంది. సీనియర్లను కాదని యువపేసర్ రిచర్డ్ గరవ(Richard Nagavara)కు టెస్టు, వన్డే పగ్గాలు అప్పగించారు. హరారేలో శనివారం జరిగిన నాలుగో అర్ధభాగం సమావేశంలో జింబాబ్వే క్రికెట్ అధ్యక్షుడు, సభ్యులు రిచర్డ్‌ను కొత్త నాయకుడిగా ఎంపిక చేశారు. అనంతరం వారు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ రెండు ఫార్మాట్లలో అతడికి డిప్యూటీగా బ్రియాన్ బెన్నెట్ వ్యవహరించున్నాడు.
పేస్ సంచలనమైన రిచర్డ్ గవర 2017లో వన్డే, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. జింబాబ్వే వెటరన్ క్రెగ్ ఎర్విన్ సారథిగా వైదొలగడంతో అనుభవజ్ఞుడైన రిచర్డ్‌కు బాధ్యతలు అప్పగించారు సెలెక్టర్లు. ‘గత కొంతకాలంగా ఆటగాడిగా, నాయకుడిగా నగవర ఎదిగాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అతడికి అమితమైన గౌరవముంది. అన్ని ఫార్మాట్లలో అతడు నిలకడగా రాణిస్తున్నాడు.
ZIMBABWE Cricket (ZC) has appointed fast bowler Richard Ngarava as the national men’s team captain for Test and One-Day International cricket, marking a new chapter in the Chevrons’ leadership transition… Rising all-rounder Brian Bennett has been named vice-captain.… pic.twitter.com/wLiZDzLn9J
— ZBC News Online (@ZBCNewsonline) December 20, 2025
అందుకే.. తదుపరి కెప్టెన్‌గా నగవరను ఎంపిక చేశాం. నాయకుడిగా అతడు విజయవంతం అవుతాడని ఆశిస్తున్నాం. ఇక బెన్నెట్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం అతడి క్రికెట్ నైపుణ్యాలపై మాకున్న నమ్మకం. జింబాబ్వే క్రికెట్‌కు అతడు భవిష్యత్ తార అవుతాడు’ అని జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తవేంగ్వా ముకుహ్లని(Tavengwa Mukuhlani) తెలిపాడు.
22 years old today. One of the world’s most exciting young talents- the incredible Brian Bennett🇿🇼 pic.twitter.com/cqa2LvMcv8
— Adam Theo🇿🇼🏏 (@AdamTheofilatos) November 10, 2025
అంతర్జాతీయంగా మూడు ఫార్మాట్లలో 150కి పైగా మ్యాచ్‌లు ఆడిన రిచార్డ్ గవర.. టీ20ల్లో వంద వికెట్లు తీశాడు. రిచర్డ్‌తో కలిసి పేస్ దళంలో రాణిస్తున్న బ్రియాన్ బెన్నెట్‌కు వైస్ కెప్టెన్సీ దక్కింది. నిరుడు వన్డే, టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన బెన్నెట్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు.