Telangana Assembly : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం అసెంబ్లీ, శాసన మండలికి వేర్వేరు కార్యదర్శుల నియమించింది. శాసన సభ కార్యదర్శిగా ఆర్. తిరుపతి (R.Tirupati) నియమితులవ్వగా.. శాసన మండలికి వీ.నరసింహాచార్యు (V.Narasimhacharyulu)లు కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
ఎగువ, దిగువ సభలకు విడివిడిగా కార్యదర్శుల నియామకానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
రాష్ట్ర శాసన సభకు సెక్రటరీగా కొనసాగుతున్న డాక్టర్. వీ.నరసింహ చార్యులును మండలికి కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న ఆర్.తిరుపతి ఇకపై శాసన సభ కార్యదర్శిగా సేవలందిస్తారని ప్రభుత్వం తెలిపింది.