గుణ: మధ్యప్రదేశ్‌లోని గుణలో ఓ శిక్షణ విమానం కూలింది. ఈ దుర్ఘటనలో ట్రైనీ మహిళా పైలట్‌కు గాయాలయ్యాయి. నీముచ్ నుంచి సాగర్‌కు వెళ్తుండగా శిక్షణ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అత్యవసర ల్యాండింగ్ చేస్తుండగా, రన్‌వేపై కూలి పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది.