శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 19:25:04

తెలంగాణకు వర్ష సూచన

తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్‌ :  రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, అలాగే నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయని వీటితో ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధారణం కన్నా 54 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయని తెలిపారు. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 91శాతం, అత్యల్పంగా కరీంనగర్‌లో సాధారణం కంటే 24శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పారు. కాగా, మంగళవారం హైదరాబాద్‌ నగర శివారులోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ముఖ్యంగా ఈసీఐఎల్, కుషాయిగూడ, జవహర్‌నగర్‌ మున్సిపల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo