Vande Bharat TTE | వందే భారత్ రైలు టిక్కెట్‌ను సగానికే ఆఫర్ చేసిన టీటీఈ.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Vande Bharat TTE | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తికి సగం ధరకే రైలు టిక్కెట్‌ను ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆఫర్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే స్పందించింది. ఆ టీటీఈని సస్పెండ్ చేసింది.
న్యూఢిల్లీ: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తికి సగం ధరకే రైలు టిక్కెట్‌ను ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్ (టీటీఈ) ఆఫర్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే స్పందించింది. ఆ టీటీఈని సస్పెండ్ చేసింది. (Vande Bharat TTE) బీహార్‌లోని దానాపూర్‌లో ఈ సంఘటన జరిగింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆన్లైన్ ద్వారా స్పాట్ టిక్కెట్ బుకింగ్ చేసుకుంటానని టీటీఈని కోరాడు. దీనికి ఆయన నిరాకరించాడు. ప్రయాణ ఛార్జీ సుమారు రూ.750 ఉన్నప్పటికీ రూ.380 ఇస్తే సీటు ఏర్పాటు చేస్తానని ఆ ప్రయాణికుడితో టీటీఈ అన్నాడు.
కాగా, ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో దానాపూర్ డివిజన్ డీఆర్ఎం, రైల్వే అధికారులు స్పందించారు. ఆ టీటీఈని తక్షణమే సస్పెండ్ చేశారు. ఆన్‌బోర్డ్ రైలు టిక్కెట్ల జారీలో పారదర్శకత లోపంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
Vande Bharat ₹750 ticket was being arranged by the TTE for just ₹380.⁰
This guy records it and made it viral😭 pic.twitter.com/hjHH35rPAC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

