Railway Worker | బీహార్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైలు కోచ్‌ల (Train Coaches) మధ్య నలిగి ఓ కార్మికుడు (Railway Worker) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బెగుసరాయ్‌లోని బరౌని జంక్షన్ (Barauni Junction)లో శనివారం చోటు చేసుకుంది.
రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. సోన్పూర్ రైల్వే డివిజన్ (Sonpur Railway Division) పరిధిలోని స్టేషన్లో పనిచేస్తున్న అమర్ కుమార్ రావు శనివారం ప్లాట్‌ఫామ్ 5పై విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ సమయంలో లక్నో – బరౌనీ ఎక్స్‌ప్రెస్ రాగా.. రైలు కప్లింగ్‌లను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో రైలు అనూహ్యంగా రివర్స్ రావడంతో రెండు కోచ్‌ల మధ్య అతను ఇరుక్కుపోయాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటన అనంతరం రైలు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు.
Also Read..
Vande Bharat | లక్నో వెళ్తున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి.. యువకుడు అరెస్ట్
Sanjiv Khanna | మార్నింగ్ వాక్ అలవాటును వదులుకున్న తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
Samantha | అందుకే అలాంటి పాత్రలకు దూరంగా ఉంటా : సమంత