Samantha | అందుకే అలాంటి పాత్రలకు దూరంగా ఉంటా : సమంత
Samantha | సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు తాను దూరంగా ఉంటానని టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) స్పష్టం చేశారు.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) తాజాగా హిందీ వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel Honey Bunny)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం సామ్.. ఈ సిరీస్ ప్రొమోషన్స్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. సినిమాల్లో మహిళల పాత్ర గురించి (fair representation of women in films) మాట్లాడారు. మహిళా పాత్రలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం నటిగా తన బాధ్యత అని అన్నారు.
ఆడియన్స్‌ను తక్కువ అంచనా వేయకూడదని.. వారు అన్ని విషయాలను గమనిస్తుంటారని సమంత అన్నారు. అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాల్సి ఉంటుందన్నారు. తాను ఓ విషయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు.. దానికి సంబంధించి పూర్తి బాధ్యత తనపై ఉంటుందన్నారు. అందుకే సినిమాల్లో పాత్రను ఎంచుకునే సమయంలో ఆచితూచి అడుగు వేస్తానని తెలిపారు. ఎన్నో విషయాలు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే సినిమాల్లో రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు తాను దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. యాడ్స్ విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని సామ్ చెప్పుకొచ్చారు.
ఇక ఇదే కార్యక్రమంలో ‘సిటాడెల్: హనీ బన్నీ’లో తన పాత్ర గురించి కూడా సామ్ మాట్లాడారు. ఈ సిరీస్‌లో నటించడం తనకు సవాల్‌గా అనిపించిందన్నారు. ఇందులో తన పాత్ర హీరోకు సమానమైనదని.. యాక్షన్ సన్నివేశాల్లోనూ హీరోతో సమానంగా చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయన్నారు. అందుకోసం నటీనటులు చాలా మంది ఎదురుచూస్తుంటారని చెప్పారు. కానీ తనకు ఇలాంటి అవకాశాలు ఎన్నో వచ్చినప్పటికీ అందులో సెలక్టివ్‌గానే వెళ్తున్నట్లు సామ్ తెలిపారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
Nayanthara | నయనతారపై నెట్‌ఫ్లిక్స్ డాక్యూమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Prabhas | ఆ ఘనత ప్రభాస్‌కు మాత్రమే సాధ్యం
Udaya Bhanu | చాలా విరామం తర్వాత సిల్వర్‌స్క్రీన్‌పై ఉదయభాను
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

